Saturday, 7 November 2026

నేరేడుచర్ల హైస్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీకి ఎంపిక

నేరేడుచర్ల హైస్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీకి ఎంపిక

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీల్లో జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల విద్యార్థిని బానోతు విగ్నేశ్వరి, తెలుగు మీడియం, విద్యార్థులందరిలో ప్రధమ శ్రేణిలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. శ్రీనివాసరావు,తెలిపారు.ఈ సందర్బంగా రాష్ట్రస్థాయిలో కూడా విద్యార్థులు తన ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వరరావు అన్నపూర్ణ, నర్స కుమారి, పద్మావతి, సైదులు ,రషీద్ ఖాన్,నరసింహారావు,మాధవి,భవన,కృష్ణప్రసాద్,శ్రీనివాసరావు ,స్రవంతి ఉపాధ్యాయులు అభినందించారు.