Friday, 6 November 2026

ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను విజయవంతం చేయండి

ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను విజయవంతం చేయండి”
పెన్ పహాడ్. డిసెంబర్ 15 (జనం సాక్షి) :
ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండల పరిధిలోని  దూపాడు. భక్తాలపురం . లింగాల గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుంజ వెంకటేశ్వర్లు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ .మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు పెరగడం లేదు వ్యవసాయ కార్మికులు కూలీ రేట్లు పెంపుకు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కనీస వేతనాలు అమలు జరపటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు పోడు రైతులకు అక్కుపత్రాలు అమలు జరపాలని ఈ దశలో వ్యవసాయ కార్మికులు జీవన పరిస్థితులు మెరుగుపడేలా ప్రతి వ్యవసాయ కార్మికులకు మూడు ఎకరాల భూమి రైతు సమస్యల పరిష్కారానికై వ్యవసాయ కార్మిక సంఘం అనేకమైన పోరాటాలు చేసినప్పటికీ నేటికీ అమలుపరచటంలో పూర్తిగా విఫలమయ్యారు వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రోజుకు 700 రూపాయలు కూలి ఇవ్వాలని అదే మాదిరిగా పని దగ్గర ప్రమాదాలకు గురైన వారికి వైద్య ఖర్చులు డబ్బులు ఇవ్వాలని ప్రతి వ్యవసాయ కార్మికునికి దళిత బంధువు గిరిజన బంధువు ఇవ్వాలి ఇంటి స్థలం ఇల్లు లేని కుటుంబాలకి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాాలనీ  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కొండమీది రాములు .నెమ్మాది అడిమయ్య .రణపంగ అశోక్. తురక వెంకటేశం.
చింతమల్ల మట్టయ్య .గుంజ సుమీల .అంజయ్య . నిర్మల. రాధా .ప్రేమ్ కుమార్. మాధవి. లక్ష్మి .బిక్షం .తదితరులు పాల్గొన్నారు