Friday, 6 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాళీ బస్తాలకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాళీ బస్తాలకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు”

ఫోటోరైటఫ్:కాలిపోతున్న గోనె బస్తాలు

పెన్ పహాడ్ డిసెంబర్ 15 (జనం సాక్షి) : మండల పరిధిలోని ధూపహాడ్ (జల్మ్ లకుంటా తండా)ఐకెపి కేంద్రంలో కాళీ ఉన్న కొత్త సంచుల రెండు బెల్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా సుమారుగా 1000 కాలి బస్తాలు దగ్ధమైయ్యాయి ఈ సంఘటనపై ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వివోఏ దూత శ్రీనివాస్,అధ్యక్షురాలు ఎరకలి వనజ పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్లు పూర్తి సమాచారం బయటపడవలసిన అవసరం ఉన్నదని రైతు సోదరులు కోరుతున్నారు ఈ విషయంపై అధికారులకు ఏపీఎం అజయ్ నాయక్, స్థానిక ఎమ్మార్వో శేషగిరిరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఐకీపీ కేంద్రం నిర్వహిస్తున్న స్థలం గతంలో గంట గోపాల్ రెడ్డి పాఠశాలను నిర్మానించి ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగిందనీ స్థానికులు తెలిపారు జరిగిన విషయంపై పూర్తి విచారణ చేయాలని ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకున్నారు