ఈనెల 29న జరిగే బహిరంగ సభకు తరలి రావాలి
* వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్
టేకులపల్లి, డిసెంబర్ 25( జనం సాక్షి ): ఈనెల 29 న ఖమ్మం లో జరిగే బహిరంగ సభకు వేలాది మంది తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు కిష్టారం గ్రామంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఖమ్మం బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసం నరసింహారావు, వీరన్న, చింత రమేష్,జోగ దశరథ్, గుమ్మడి ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.




