బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
చర్చిలకు స్వీట్లు పంపిణీ
పెనుబల్లి, డిసెంబర్ 25(జనం సాక్షి) పెనుబల్లి మండలం లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఆదేశాల మేరకు వంగా ముత్యాల బంజర్ లో ఆదివారం ప్రదాన చర్చి ల్లో బి ఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్ ఆధ్వర్యంలో స్వీట్ బాక్స్ లను పంపిణీ చేసారు, ఈసందర్భంగా బి ఆర్ ఎస్ స్థానిక నాయకులు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు.కార్యక్రమంలో నీలాద్రి దేవస్థానం కమిటీ సభ్యులు వంగా సురేష్ (చిన్నపండు), వంగా చంద్రశేఖర్, వి ఎం బంజర్ బి ఆర్ ఎస్ పార్టి గ్రామ కార్యదర్శి గోదా శ్రీనివాసరావు, వేముల సురేష్, గోపాల్, శివ తదితరులు పాల్గొన్నారు




