Monday, 2 November 2026

బాడ్మింటన్ ఎంపిక పోటీలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, క్రీడాకారుల ఎంపిక పోటీలు గురువారం మంచిర్యాలలోని రంగంపేట లో గల మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో , పోటీల ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ గాజుల ముఖేష్ గౌడ్ హాజరై జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మధు లతో కలిసి క్రీడాకాలని పరిచయం చేసుకొని బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు, ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా సాధన చేసి ఎదగాలని కోరారు, జిల్లా బ్యాడ్మింటన్ సెక్రెటరీ సుధాకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మంచి ప్రతిభ కనబరిచే విధంగా కృషి చేస్తున్నమన్నారు, సీఎం కప్పు బ్యాడ్మింటన్ పోటీలలో ఉమెన్స్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన శ్రీవల్లిని, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటున్న స్థిత ప్రజ్ఞ రెడ్డి, మాస్టర్స్ 75 ప్లస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన పళ్లెం రాజలింగం ను ఘనంగా శాలువాలతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు కృష్ణ, పేట సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శ్రీనివాస్, ఎస్ జి ఎఫ్ మాజీ కార్యదర్శి రాజయ్య, కోచ్ నాగేంద్ర, సీనియర్ క్రీడాకారులు రవి తదితరులు పాల్గొన్నారు.