హైదరాబాద్ : 52 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 4నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 52గంటల దీక్ష చేపట్టనున్నట్లు రాయలసీమ ఐకాస ప్రకటించింది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ రాయలసీమ ఎమ్మెల్యేలు అంతా ఏకం కావాలని ఐకాస నేతలు కోరారు. తెలంగాణ ప్రజల డిమాండ్ సమంజసమైనదేనని, రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఐకాస డిమాండ్ చేసింది.




