Tuesday, 3 November 2026

మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన లలిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితారాఘవేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో బధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ మహిళా కాంగ్రెష్‌ అధ్యక్షురాలు అనితా వర్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, గంగాభవాని తదితర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండగానే ఆకుల లలితకు రాష్ట్ర కాంగ్రెష్‌ మహిళా అధ్యక్షురాలి పదవి కట్టబెట్టడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *