Tuesday, 3 November 2026

ఈనెల 6న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి – జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి

ఈనెల 6న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి – జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 3 (జనంసాక్షి): ఈనెల 6వతారీఖున రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి ల హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేద్దామని హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం హుజూర్‌నగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి అధ్యక్షతన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ కడియం వెంకటరెడ్డి లు హాజరైనారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలిచిన తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గంలో 3500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఈనెల ఆరో తారీఖున రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా సుమారుగా 200 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను కూడా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిష్కరించడం జరిగిందన్నారు. హుజూర్ నగర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి మంత్రి కేటీఆర్ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబి, సర్పంచులు అంజిరెడ్డి, సైదులు, సైదేశ్వరరావు, ఎంపీటీసీలు రాజారావు, రైతు సమన్వయ సమితి సభ్యులు వీరభద్రరావు, పిఎసిఎస్ చైర్మన్ అన్నెం శౌరిరెడ్డి, మండల నాయకులు రామయ్య, లింగారెడ్డి, నరసింహారావు, సుందరయ్య, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, హుస్సేన్, గండు సైదులు, ముజీబ్, కృష్ణమోహన్, శ్రీను, నాగేశ్వరరావు, బిక్షం, హనుమారెడ్డి, మున్నీరు, జానీమియా తదితరులు పాల్గొన్నారు.