Thursday, 5 November 2026

కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి చిన్నారెడ్డి

కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి చిన్నారెడ్డి నిరసన…..వనపర్తి టౌన్* : డిసెంబర్ 5 ( జనం సాక్షి ) వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు మరియు మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో,వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి, జిల్లా అధ్యక్షులు పిసిసి సభ్యులు,శంకర ప్రసాద్ పాల్గొనడం జరిగింది. మాజీ మంత్రి డాక్టర్ జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు , జెయింట్ కలెక్టర్ వేణుగోపాల్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన, కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు రైతులకు ఏకాకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి, నేటికీ అమలు కాలేదు, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తా అని చెప్పి ఇంతవరకు అమలు కాలేదు రైతుల భూములు తగాదాలు ఉన్న అట్టి భూములను బి-కేటగిరీలో పెట్టి ఇంతవరకు వాటిని కొత్త పాసు పుస్తకంలో ఎక్కించుకోలేదు పోడు భూములకు పట్టాలిస్తానని, చెప్పి నేటికీ పట్టాలు ఇవ్వలేదు, కవులు రైతులకు ఎలాంటి సహాయం లేదు పంటనష్టం మాటనే లేదు మొత్తంగా రైతులను నట్టేట ముంచేసి క్రమంలో “ధరణి పోటల్ “రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు ద్వారా మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతుల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని,మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, జిల్లా అధ్యక్షులు పిసిసి సభ్యులు,శంకర్ ప్రసాద్, శ్రీరంగాపురం జడ్పిటిసి సభ్యులు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, మత్స్యకార జిల్లా అధ్యక్షులు యాదయ్య, మైనార్టీ జిల్లా అధ్యక్షులు కమ్మర్ మియా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహదేవయాదవ్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాల్య నాయక్,కౌన్సిలర్ బ్రహ్మం, తుమ్మల రాములు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా, భాస్కర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డీ. వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.