Thursday, 5 November 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 

 

 

 

మోత్కూరు ఏప్రిల్ 12 జనం సాక్షి : మున్సిపల్ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో జరిగిన బిజెపి స్వశక్తి కరణ, శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ కాప రవి కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ప్రతి బూతులో విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి పార్టీ అని రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డ్ మెంబర్ కొనతం నాగార్జున రెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, దొంతి నరసింహారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బయ్యని రాజు, సజ్జన మనోహర్, మరాటి అంజయ్య, కూరాకుల వెంకన్న,మేడబోయిన యాదగిరి, పోచం సోమయ్య, సొల్లేటి నరేష్, చేకూరి మల్లేష్,మురారి శెట్టి అనిల్, సకినాల సోమయ్య, జక్కా మోహన్ రెడ్డి, దీటి సందీప్, అండెం సుధాకర్ రెడ్డి, గుంటి సతీష్, రాము యాదవ్, నారాబోయిన కొండలు, నర్సింగ్ మహేష్, కందుకూరి ప్రకాష్, కందుకూరి ప్రశాంత్ ఎడ్ల రాము,టంగుటూరి వెంకన్న, బిరుదు శ్రీను తదితరులు పాల్గొన్నారు.