ఈపి టెక్నిషియన్స్ విజ్ఞప్తి

ఈపి టెక్నిషియన్స్ కౌన్సెలింగ్-టిటిసీ లో ట్రియనింగ్ పూర్తి కాగానే కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు,ఈ ప్రక్రియ ఎన్నో సంవత్సర ల నుండి కొనసాగుతుంది,

కానీ కౌన్సెలింగ్ లేకుండానే 56,57 (ఫిట్ )33,34 (ఈఎల్ఈ ) బ్యాచ్ లకు టెంపరరీ పోస్టింగ్ ఇచ్చి నట్లు షో చేస్తూ మమ్ములను మభ్యపెడుతూ, వారికి పెరిమినెంట్ పోస్టింగ్ అని వారికి చెబుతున్నారు,ఈ బ్యాచ్ ల వాళ్ళు మాది పెర్మినెంట్ పోస్టింగ్ అని ధీమాగా చెబుతున్నారు.

 

ఈ విషయం గురించి ఒక సెంటనరి కాలనీ లో వుండే ఒక ముఖ్య నాయకుని దగ్గరకు వెళ్ళినపుడు ఆ నాయకుడు మాతో 56 బ్యాచ్ కౌన్సెలింగ్ కు రాదు,57 బ్యాచ్ వస్తుంది అని చెప్పారు , ఆ నాయకుని కి 56 బ్యాచ్ కు కౌన్సెలింగ్ లో ఉండదు అని ఎలా తెలిసింది,ఇందులో ఉన్న మర్మం ఏమిటో అని అర్థం కాలేదు. మరియు మీరు వెళితే కొత్తగూడెం మెయిన్ ఆఫీసు లో మీకు అన్ని విషయ లు చెబుతారు అని సూచించారు.

అలాగే ఒక *ముఖ్య అధికారి ని పోన్ ద్వారా సంప్రదించినపుడు మెయిన్ ఆఫీస్ కు కొత్తగూడెం రండి అని సూచించారు.

మేము వారి సూచన మేరకు 9-12-22 నకొత్తగూడెం మెయిన్ ఆఫీస్ కు వెళ్లి నపుడు ఈపి టెక్నిషియన్స్ కౌన్సెలింగ్ ను అపుతున్నది సెంటనరి కాలనీలో ఉన్న ముఖ్య నాయకుని ఒత్తిడి మేరకు, 56,57 బ్యాచ్ లకు కౌన్సెలింగ్ లో ఉంచడం లేదు అని తెలిసినది.

డైరెక్టర్ పా కి గత సంవత్సరం నవంబర్ లో మేము కౌంసీలింగ్ కొరకు వినతిపత్రం ఇచ్చిన సమయములో ,అక్టోబర్ నెల లో శ్రీరాంపూర్ ఏరియా లో గ్రీవెన్సు లో కూడా మేము వినతి పత్రం ఇస్తున్న సమయములో, మరియు మేము మెయిన్ ఆఫీస్ కొత్తగూడెం కు వెళ్ళినపుడు కూడా ఆ ముఖ్య అధికారి అక్కడ్నుంచి తప్పుకొని వెళ్లిపోయారు.ఇది కాకథాలియంగా/యాదృచ్చికంగా జరిగిందా లేక కావాలి అని తప్పుకున్నారా అని తెలియడం లేదు.

గ్రీవెన్సు లో ఆ అధికారి ని డైరెక్టర్ పా గారు పిలిపించి డాం జరిగింది,ఆప్పుడు వార్56,57 రెండు బ్యాచ్ లు టెంపరరీ పోస్టింగ్ లో వున్నారు,ఇంకో బ్యాచ్ కు త్వరలోనే ట్రైనింగ్ అయిపోతుంది ,ఆ మూడు బ్యాచ్ లతో మీకు కౌన్సిలింగ్ త్వరలోనే నిర్వహిస్తాము అని చెప్పారు కానీ ఎలాంటి చర్యలు లేవు/కాలయాపన చేస్తున్నారు.

 

వీటి వలన మాకు అనుమానం వస్తుంది,
కౌన్సెలింగ్ లేట్ కావడానికి
ఆ ముఖ్య అధికారి ,ముఖ్య నాయకుడు కలిసి ఏమైనా గోల్మాల్ చేస్తున్నారా అని మాకు అనుమానం కలుగుతోంది.

అయిన అధికారులు….. నాయకులు చెప్పారని ఒక మంచి పారదర్శకంగా వుండే కౌంసీలింగ్ విధానాన్ని తుంగలో తొక్కడాము ఎంత వరకు సబబు.
ఇందులో ఉన్న గోలమాల్ ఆ దేవుడికే తెలియాలి.

మేము మా ఏరియా నుండి కొత్తగూడెం వెళ్లి రావడానికి మాకు ఒక 15000 వేల రూపాయలు మరియు మా డ్యూటీ లను కోల్పోయము.

ఐయినా అధికారులు/నాయకులు సమయానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తే మాకు/మనకు ఈ బాధలు ఉండేవి కావు.

మా విజ్ఞప్తి
అధికారులను,నాయకుల ను56,57,58 బ్యాచ్ లతో వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించే ల చూడాలని కోరుతున్నాము.

…. ఈపి టెక్నిషియన్స్,సింగరేణి –