వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, సర్పన్ పల్లి, గోధుమగూడ, రాళ్ళచిట్టెంపల్లి గ్రామాలు ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని, వాటిని వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని, నూతనంగా వికారాబాద్ జిల్లా ఏర్పడటంతో… ఒకటే పోలీస్ స్టేషన్ ఉండడంతో, ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, వికారాబాద్ మండలానికి మరియు పట్టణానికి వేరువేరుగా రెండు పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని మరియు పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరడంతో, నూతన భవనానికి మార్చడం జరిగిందని, పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని కూల్చివేసి, నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని, ధారూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెసిడెన్సి భవనం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు కోరడం జరిగింది.




