Wednesday, 4 November 2026

జీరో పెట్రోల్.. పర్యావరణానికి అనుకూలమైన హీరో ఎలక్ట్రిక్ ఈ బైక్స్ :

 

 

 

 

 

మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరుమిర్యాలగూడ ఫిబ్రవరి 12జీరో పెట్రోల్ పర్యావరణానికి అనుకూలమైన హీరో ఈ బైక్స్ కాలుష్య రహితమని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ బస్ స్టాప్ ఎదుట శ్రీ వెంకటలక్ష్మి ఈ బైక్స్ షోరూం తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, డీలర్ రాచర్ల కమలాకర్ రావు, మిర్యాలగూడ ఈ బైక్స్ షోరూం డీలర్ చిల్లంచర్ల గౌతం, చిల్లంచర్ల శ్రీనివాస్ లతో కలిసి చైర్మన్ భార్గవ్ తిరునగరు, మాజీ చైర్ పర్సన్ నాగలక్ష్మి భార్గవ్ “హీరో ఎలక్ట్రిక్”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ భార్గవ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ (ఈ బైక్స్) ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కర్నాటి రమేష్ మాట్లాడుతూ దేశంలో పేరుగాంచిన కంపెనీ ద్వారా హీరో ఎలక్ట్రిక్ వాహనాన్ని అతి తక్కువ నిర్వహణ ఖర్చులతో తీసుకురావడంజరిగిందన్నారు. గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఈ బైక్స్ ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. హీరో ఎలక్ట్రిక్ ఈ బైక్స్ షోరూమ్స్ డీలర్ రాచర్ల కమలాకర్ రావు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పరిశోధనతో ఈవి పరిశ్రమకు మార్గదర్శక కంపెనీగా ఇండియా నెంబర్ 1 బ్రాండ్ ఇమేజ్ తో హీరో ఎలక్ట్రిక్ వాహనం ముందుకు వచ్చిందన్నారు. దేశంలోని నలుమూలలా సరఫరా అవుతూ మూడు సంవత్సరాల వారంటీ అనువైన మోడల్స్ తో కాలుష్య రహితం, సులువైన చార్జింగ్, ఎక్కువ ఆదా మైలేజీతో హీరోఎలక్ట్రిక్ టూ వీలర్ లు వాహనదారుల ప్రజాభిమానం పొందుతుందన్నారు. మిర్యాలగూడ ఈ బైక్స్ షోరూం నిర్వాహకులు చిల్లంచర్ల గౌతం మాట్లాడుతూ సరసమైన ధరలకు ఈజీ ఫైనాన్స్ సౌకర్యంతో పాటు లోన్ ఆన్ ఫోన్ సౌకర్యాన్ని వాహనదారులకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు యూనిట్ల విద్యుత్ చార్జీ 15 రూపాయలు అవుతుందని, సుమారు 60 కిలోమీటర్ల వరకు హీరో ఈ బైక్స్ పై ప్రయాణం చేయవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బండారు కుశలయ్య, ప్రముఖ డాక్టర్ టి.శరత్ బాబు, రైస్ మిల్లర్స్ కోశాధికారి పైడిమరి సురేష్, కార్యదర్శి రంగా లింగయ్య, రాయపూడి భవాని ఉమా శేఖర్, రైస్ మిల్లర్లు రంగా రంజిత్ కుమార్, రేపాల మధుసూదన్, తల్లం అశోక్, అల్లాని రమేష్, చిల్లం చర్ల హరికృష్ణ, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, గుంటూరు రామారావు, ప్రముఖ న్యాయవాది ఏచూరి శ్రీనివాస్, కుక్కడపు, రామ్మూర్తి, చీదళ్ళ శ్రీనివాస్, రేపాల లక్ష్మీకాంతం, నీలా పాపారావు, కేఎన్ఎం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్, తిరునగరు శ్రవణ్ కుమార్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుడిపాటి సైదులు బాబు, క్లియో స్పోర్ట్స్ ఎండి. ఏచూరి శ్రీహర్ష, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు రిటైర్డ్ఏఈకంచిసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.