రుద్రూర్ (జనంసాక్షి):రుద్రుర్ మండల కేంద్రంలో రామ్ రాజ్ ఆగ్రో ఇండస్ట్రీ (రైస్ మిల్)ని ఉమ్మడి నిజామాబాద్ డిసీసీబీ ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ,రాష్ట్ర యువ నాయకులు పోచారం సురేంధర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యజమాని రామ్ రాజ్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.రాణంపల్లి గ్రామ సీనియర్ నాయకులు ఇల్టెం బాలరాజు నూతన గృహ ప్రవేశం మరియు పుట్టుపంచేల కార్యక్రమానికి మరియు
బొప్పపూర్ గ్రామ నాయకులు దవోజి దత్తు కుమారుడు దవోజి శ్రీకాంత్ వివాహానికి హాజరయి బిఆర్ ఎస్ కార్యకర్తల శుభకార్యాక్రమలలో రాష్ట్ర యువ నాయకులు పోచారం సురేంధర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ , పత్తి రాము, రాజారామ్, ప్రితం దేశయే, అక్కపల్లి నాగేందర్, అహ్మద్ హుస్సేన్ , ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు




