రైల్వేట్రాక్‌తో మేఘాలయ అనుసంధానం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఈశాన్య రాష్టాల్ల్రో రైల్వే సేవలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. మేఘాలయను అరుణచల్‌ప్రదేశ్ విూదుగా రైల్వేట్రాక్‌తో అనుసంధానం చేస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బ్జడెట్‌ను ఆయన ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. దీంతో ఈశాన్య రాష్టాల్ల్రో రైల్వే సేవలు విస్తరించనున్నాయి.భారతీయ రైల్వేల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నట్టు కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభాకర్‌ప్రభు రైల్వేబ్జడెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛరైల్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. రైల్వే/-టసేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా వుంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక 815 కి.విూ. దూరం గేజ్ కన్వర్షన్ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిందన్నారు. జాప్యం లేకుండా నిర్దేశిత సమయానికి రైళ్లు ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని, లైన్ల డబ్లింగ్ కోసం 77 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం వస్తుందన్నారు. రైల్వే బ్జడెట్ ప్రసంగం ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా సాగింది. బ్జడెట్ ప్రసంగంలో కొత్త రైళ్లపై ఎలాంటి ప్రకటన చేయకుండానే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రసంగాన్ని ముగించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు.
దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-ముంబయి మధ్య రాత్రి పూట రైళ్లు నడుపుతామని అన్నారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇక రైళ్లలో అగ్నిప్రమాదాలు, పట్టాలు తప్పడం లాంటి ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఇస్రో, కాన్పూర్ ఐఐటీ సహకారంతో కాపలలేని క్రాసింగ్ వద్ద హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కోసం పరిశీలన చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 3438 లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపునకు రూ.6750కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో రైల్వేల్లో వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తామని అన్నారు.
ఈ ఏడాది కొత్తగా 4 కొత్త సరకు రవాణా కారిడార్లు కూడా ప్రకటించారు. పచ్చి సరకు, కూరగాయలు,
పండ్లు, రవాణాకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధి వ్యాపారీకరణకు ఆన్‌లైన్ బిడ్డింగ్ అనుసరిస్తామన్నారు. ఇక హిందీ, ఇంగ్లిష్‌లతో పాటు ఇతర స్థానిక భాషల్లోనూ టిక్కెట్లు ఇచ్చేందుకు రైల్వే సిద్ధమైంది. వివిధ భాషల్లో ఈ-టిక్కెటింగ్ వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు బ్జడెట్ ప్రసంగంలో తెలిపారు. రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు …దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.




