వరంగల్ ఈస్ట్, మే 25 (జనం సాక్షి)తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడు రంగసాయిపేటకు చెందిన పరికిపండ్ల ఈశ్వరయ్య 74 వ జన్మదిన వేడుకలు సందర్భంగా గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈశ్వరయ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్, కర్ర కుమార్, బజ్జూరి రవి, సుమన్, వలుపదాసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




