వికారాబాద్ రూరల్ మే 25( జనం సాక్షి)
వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉప్పరి ప్రసాద్ నియమించినట్లు వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు వికారాబాద్ జిల్లా తో పాటు మల్కాజిగిరి జిల్లాకు కొత్త అధ్యక్షులు నియమించినట్లు తెలిసింది వికారాబాద్ జిల్లాలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది దీనికి తోడు దళితుడైన ఉప్పరి ప్రసాద్ ఇదివరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ వికారాబాద్ ఇన్చార్జిగా పనిచేశారు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఉప్పరి ప్రసాద్ కేటాయించడంతో వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీని చేయాలని ఆదేశించినట్లు తెలిసింది అనంతరం జిల్లా అధ్యక్షునిగా నియమితులను ఉప్పరి ప్రసాద్ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పుష్పగుచ్చాలు సమర్పించి కృతజ్ఞతలు తెలిపారు
వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉప్పరి ప్రసాద్ నియమాకం




