Tuesday, 3 November 2026

ఈ నెల 10న దుబ్బాకలో “మెగా జాబ్ మేళా”

 

 

 

 

 

 

 

జనం సాక్షి దుబ్బాక.పాల్గొననున్న 100కు పైగా కంపెనీలు.. వేలల్లో ఉద్యోగావకాశాలుజాబ్ మేళాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక నెంబర్ ఏర్పాటు 7893335975QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సౌకర్యంవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావుసింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహించనున్న “మెగా జాబ్ మేళా” వాల్ పోస్టర్ ను ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 100కు పైగా కంపెనీలు పాల్గొని.. 10 వేలకు పైగా ఉద్యోగావకాశాలు ఉన్న నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గం పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు దుబ్బాక ఎమ్మెల్యే కార్యాలయంను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, సుంకు ప్రవీణ్ సుభాష్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.