జనం సాక్షి,చెన్నారావుపేటమండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ ట్రాక్టర్ ఓనర్స్ యూనియన్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గొడిశాల మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా చెందు, కోశాధికారి ఒంటరి క్రాంతి ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో అధ్యక్ష పదవి అప్పజెప్పడంతో బాధ్యత మరింతగా పెరిగిందని, యూనియన్ లో ఎవరికి సమస్య వచ్చినా వారికి నా వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు సిద్ధ జనార్ధన్, వల్ల సదానందం, జయంత్,దిలీప్,తుటి శ్రీను, ఇస్లావత్ స్వామి, రొడ్డ రవి,రెడ్యా,కృష్ణ, శోభన్ తదితరులు పాల్గొన్నారు.




