Wednesday, 4 November 2026

ఈ నెల 11న తెలంగాణ మహాధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వ్ద తెలంగాణ మహాధర్నా నిర్వహిస్తామని తెలంగాన ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెలకాంతం తెలిపారు. ఏ రాజకీయ పార్టీకీ తెలంగాణపై చిత్తశుద్ధిలేదని, వారి స్వలాభాల కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికైన పార్టీలన్నీ ఐక్యంగా ఉద్యమించకపోతే రానున్న ఎన్నికల్లో భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉద్యమం సందర్భంగా ఉద్యోగులు, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. తెలంగాణకు మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి లేఖలు రాయాలనికోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *