ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్06.
ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రము లోని జిసిసి గోధాం వద్ద ఈ నెల 11 వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభ వాల్ పోస్టర్స్, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, మరియు రాష్ట్రంలోని కే సి ఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఒక్క ప్రభుత్వ రంగం కూడా ఉండే అవకాశం లేదు అన్నారు, దాని వల్ల రాబోయే రోజుల్లో పేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే కార్మికులకు కనీస వేతనాలు అందించే పరిస్థితులు లేవన్నారు అందుకే ఈ ప్రభుత్వాల పై అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్వవసాయ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు, బుడుగు బలహీన వర్గాల ప్రజలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని, అందులో భాగంగానే కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, సిపిఐ మండల కార్యదర్శి నాసర్,బొల్లం సారయ్య, ఏఐటియుసి నాయకులు దానం బిక్షపతి,వెల్దండి కొమురయ్య, చింతకింది రాములు, మాటేమిటి కుమారస్వామి, వెల్దండి రమేష్, పాపాని రమేష్,పాషికంటి శ్రీధర్ , గాడిచర్ల బాబు,అక్కెనపెల్లి రవి,ఏంపెల్లి ఎల్లయ్య, వావిలాల సుధాకర్,మందపెల్లి క్రిష్ణ, బొధ్ధుల రాజు,పోగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 11,వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి




