Wednesday, 4 November 2026

పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో పేద మెడిసిన్ విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేత

రఘునాథ పాలెం జూన్ 06(జనం సాక్షి)ఖమ్మం నగరంలోని రాజకుమారి తల్లి పిల్లల హాస్పిటల్ నందు పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో మరియు జంగం ఫ్యామిలీ సభ్యులైన జంగనరేందర్,ధర్మారావు,కోటేశ్వరావు,నీరజ, సునీల్ కుమార్, శ్రీనివాస్ మొ. గు వారి సహకారంతో మమత మెడికల్ కాలేజ్ నందు మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని కందుల నీరజ హాస్టల్ ఫీజుకి ఆర్థికంగా 30 వేల రుపాయలు సహాయం చేయడం జరిగింది. డా. స్వర్ణ కుమారి-బాబురత్నాకర్ దంపతులు, నీరజ కు స్టేతస్కోప్ నీ అందజేయడం, అలాగే సూర్యాపేట మెడికల్ కాలేజ్ నందు చదువుకుంటున్న పానెం సోనీ కి జంగం జయకర్, గుంతేటి వీరభద్రం లు, జమ్మి జైపాల్ లు స్టేత స్కోప్ ను అందజేశారు.ఈ సందర్భంగా డా.బాబు రత్నాకర్, డా.స్వర్ణకుమారి దంపతులు మాట్లాడుతూ. పేద విద్యార్థులకు సహాయం చేయటం గొప్ప విషయమని అలాగే ప్రతి ఒక్కరూ పే బ్యాక్ టు సొసైటీ ద్వారా పూలె, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తమకు ఉన్న దానిలో పేద విద్యార్థుల చదువులకు ఎంతోకొంత నిరంతరం ఆర్ధిక సహాయం చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.గుంతేటి వీరభద్రం,జంగం జయకర్ మాట్లాడుతూ. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తూ, ఉన్నత చదువులు చదవాలనే వారికి మనో ధైర్యం నింపుతున్న పే బ్యాక్ టు సొసైటీ కి ధన్యవాదాలు తెలియజేశారు.పే బ్యాక్ టు సొసైటీ వ్యవస్థాపకులు జంగం లక్ష్మణరావు, చిలకబత్తిని కనకయ్య మాట్లాడుతూ. ఇప్పటివరకు సొసైటీ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయటమే గాక అనునిత్యం వారికి అండగా ఉంటూ ఉద్యోగాల విషయంలో కానీ, అలాగే అనారోగ్య పరిస్థితులలో కానీ మేము ఉన్నామంటూ మాకు సహకరిస్తున్న డాక్టర్లకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ నుండి సి ఐ పొశెట్టి, కందుల విజయ్, బి మోహన్ రావు, జి సాయిబాబు, సీనియర్ జర్నలిస్ట్ పప్పుల వేణుగోపాల్, జంగం దేవన్న, తెలంగాణా శ్రీనివాస్, పెరుమాళ్ళ శ్రీనివాస్,పి రత్నాకర్, జి కనకరాజు,సవ్వడి సెల్ పాయింట్ పిరంగి శ్రీనివాస్, వైద్య విద్యార్థులు తండ్రులయినా సోమయ్య, అబ్బురామ్ లు తదితరులు పాల్గొన్నారు.