సికింద్రాబాద్: ఈ నెల 24 నుంచి కాజీగూడ, నిజామాబాద్ ప్యాసింజర్ వేళల్లో మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ మధ్యాహ్నం 2.25 గంటలకు, మనోహరాబాద్-సికింద్రాబాద్ ప్యాసింజర్ సాయంత్రం 5.15 గంటలకు, కాచిగూడ-నిజామాబాద్ ప్యాసింజరు సాయంత్రం 6.40 గంటలకు, సికింద్రాబాద్ – మేడ్చల్ ప్యాసింజరు సాయంత్రం 4.45 గంటలకు, కాచిగూడ-బోధన్ ప్యాసిఇంజరు సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్యే ప్రకటించింది.




