Wednesday, 4 November 2026

సమ్మెకు సంఘీభావం తెలిపిన. కాంగ్రెస్ పార్టీ

 

 

 

 

బచ్చన్నపేట (జనం సాక్షి) బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శిలు చేస్తున్నటువంటి సామూహిక నిరవధిక సమ్మెకు కు మద్ధతుగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు సంగిబావం తెలిపినట్టు. కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు వంచ వెంక రెడ్డి తెలిపారు. 8 రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్న 26 గ్రామాల కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ. ,బంగారు తెలంగాణ పెరు చెప్పి ఇవ్వాళ పంచాయతీ కార్యదర్శి లను బలి పశువులను చేస్తున్నారని, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయిన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కానీ, పంచాయతీ కార్యదర్శి లు ప్రతి రోజు ఉదయం 7 గంటల వరకే వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ప
పనిచేస్తున్నారని. ఎన్ని ప్రబుత్వ ఉద్యోగ శాఖలు ఉన్న విల్లే కె ఎక్కువ కష్టాలు,విళ్ళకే జీతాలు తక్కువ, వీళ్ళు న్యాయ బద్దంగా చేస్తేన్నటువంటి సమ్మె లో న్యాయం ఉన్నదని.ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించి వాళ్ళ పని భారాన్ని కూడా తగ్గియ్యాలి అన్నారు, వీళ్ళు దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది అన్నారు, ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కోడూరి మహాత్మా చారి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి,కోశాధికారి దేవరకొండ రమేష్, టౌన్ ఉపాధ్యాక్షులు దాచేపల్లి రాజయ్య, అల్వల రమేష్, మండల కార్యదర్శి అవధూత శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు బొమ్మేర్ల యాదగిరి బొమ్మేన రాజయ్య పస్తం పోషయ్య, తదితరులు పాల్గొన్నారు.