Tuesday, 3 November 2026

ఈ నెల 4న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక:విద్యాధికారి బత్తుల భూమయ్య..

ధర్మపురి ( జనం సాక్షి)ఈ నెల 4న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు ఈ నెల 4న ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మండల స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య తెలిపారు. ఈ పోటీల నిర్వహణపై శనివారం ధర్మపురి మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయన అధ్యక్షతన మండలంలోని పీఈటీలు, పిడిలతో సమావేశాన్ని నిర్వహించారు. 2023-24 విద్యా సంవత్సరానికి 4, 5 తరగతులలో ప్రవేశాలకు గాను బాల బాలికలకు ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. మూడవ తరగతి పూర్తి చేసి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ,తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు 01-09-2014 నుంచి 31-08-2015 మధ్య జన్మించి ఉండాలని, నాలుగో తరగతి పూర్తి చేసి 5వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థులు 01-09-2013 నుంచి 31-08-2014 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుతం చెబుతున్న పాఠశాల నుంచి స్టడీ బోనాఫైడ్ సర్టిఫికెట్స్, జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ప్రోగ్రెస్ రిపోర్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (10), కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు జులై 4న ఉదయం 9:30 నిమిషాలకు ధర్మపురి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హాజరుకావాలని సూచించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిలో ఒక్కో తరగతి నుంచి పది మంది బాలురు, పదిమంది బాలికల చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పి ఈ టి లు స్వప్న, రాజేందర్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.