Tuesday, 3 November 2026

సహకార బ్యాంకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి సహకార బ్యాంక్ మేనేజర్ వెంకట కృష్ణారావు

టేకులపల్లి, జూలై 1( జనం సాక్షి): అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సహకార వ్యవస్థలో సమూల మార్పులు తీసుకరావలని రైతులకు చేరువగా సహకార రంగంలో రెండు అంచల విదానాన్ని అమలు చేయాలని డీసీసీబీ లను టీఎస్ సి ఏ బి లో విలీనం చేసి సహకార బ్యాంకుల్లో పని చేస్తున్న ఉధ్యోగస్తులందరికి పాత పెన్షన్ విదానాన్ని అమలు పర్చవలసినదిగా డిమాండ్ చేస్తూ సహకార బ్యాంకులకు మూలధనాన్ని చేకూర్చాలని కోరుచూ, టేకులపల్లి బ్యాంకు నందు బోజన విరామ సమయంలో తెలంగాణ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీ బ్రాంచి మేనేజర్ పి. వేంకట కృష్ణారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది యస్.కె. అబ్ధుల్ మజీద్, ఫ్రశాంత్, సంఘ సిబ్బంది పి. ప్రేమాచారి సి.ఇ.ఓ, బి. హుస్సేన్, టి. ప్రతాప్, బి. మోతీలాల్, యం. గురుమూర్తి గార్లు పాల్గోన్నారు.