Tuesday, 3 November 2026

ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవం

టేకులపల్లి, జూలై 1( జనం సాక్షి ): బేతంపూడి సహకార పరపతి సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు ఏడు రంగుల సహకార జెండాను ఆవిష్కరించారు.1995 సంII లో ఐక్యరాజ్యాసమితి యునైటెడ్ నేషన్స్ ద్వారా సూచించబడిన అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సహకార సంఘాల భాగస్వామ్యం అవి సాధించిన సహకార ప్రగతి, నిర్ధేషించుకున్న లక్ష్యాలను భాగస్వామ్యులుగా గుర్తించడం జరిగినది. ప్రతిఒక్క సహకార సంఘాలలో, సహకార బ్యాంకులలో అంతర్జాతీయ సహకార దినోత్సవంను పురస్కరించుకొని ఏడు రంగుల సహకార జెండాను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు గుడిపుడి కృష్ణార్జున రావు, ఉల్లోజి ఉధయ్ చందర్ , దోర్నాల విజయ్ మోహన్ రావు , చీమల లక్ష్మీ నారాయణ, సంఘ సిబ్బంది, రైతులు పాల్గోన్నారు.