Tuesday, 3 November 2026

ఈ నెల 7 న జగిత్యాల జిల్లా కేంద్రంకు రాష్ట్ర ముఖ్యమంత్రి

ఈ నెల 7 న జగిత్యాల జిల్లా కేంద్రంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాకఈ నెల 7 న జగిత్యాల జిల్లా కేంద్రంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక
– ఉదయమే జగిత్యాలకు సిఎం చేరుకుంటారు
– మెడికల్ కళాశాల భవనానికి భూమిపూజ తో పాటు idoc నీ ప్రారంభిస్తారు.
– అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తారు.
– మధ్యాహ్నం 02.00 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు మోతె బహిరంగ సభలో పాల్గొoటారు.
– మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు
——————————-జగిత్యాల 01, డిసెంబర్ 2022——————————
ఈనెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ కన్నీరు హరీష్ రావు తెలిపారు.
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగిత్యాల పర్యటన దృష్ట్యా IDOC లో ఏర్పాట్లను మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు, శ్రీ కొప్పుల ఈశ్వర్, MLC శ్రీమతి కవిత, స్థానిక శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ లు, జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధు శర్మ లతో కలిసి పరిశీలించారు.
అనంతరం మోతె లో బహిరంగ సభ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.సభ సజావుగా జరిగేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పాత్రికేయులకు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 27వ తేదీన ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంకు చేరుకుంటారని మంత్రి తెలిపారు.
ఉదయం జిల్లాకు ఘనంగా మంజూరైన మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి పేర్కొన్నారు.ఆ తర్వాత ప్రజా నిధులు అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 02.00 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు వరకు మోతే లో జరగనున్న బహిరంగ సభ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుంచే కాక కరీంనగర్ జిల్లాలోని కొంత భాగం, ఆర్మూర్, బాల్కొండ నియోజవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనున్నట్లు తెలిపారు.

సిఎం శ్రీ కేసిఆర్ వల్లే జిల్లా, మెడికల్ కళాశాల
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సహకారం కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యతలను చేపట్టడం వల్లే జగిత్యాల ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం జగిత్యాల జిల్లాను సాకారం చేసుకున్నామని మంత్రి తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర o ఏర్పడకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా అని అన్నారు.

కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు రమణ, కౌశిక్ రెడ్డి, శ్రీ భానుప్రకాశ్ రావుస్థానిక శాసన సభ్యులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి, శ్రీ విద్యాసాగర్ రావు, శ్రీ చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధు శర్మ, జిల్లా అదనపు కలెక్టర్ లు మందా మకరంద్, బి ఎస్ లత తదితరులు పాల్గొన్నారు.
——————————డీ.పీ.ఆర్.ఓ, జగిత్యాల కార్యాలయంచే జారీ చేయనైనది.