Tuesday, 3 November 2026

చరిత్రను వెలికితీయడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

చరిత్రను వెలికితీయడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
– ప్రధానోపాధ్యాయులు ఎం. భీమార్జున రెడ్డి
హుజూర్ నగర్ డిసెంబర్ 1(జనంసాక్షి): గ్రామాల చరిత్ర, అభివృద్ధి, కళలు, సంస్కృతుల గురించి పరిశోధించి, మరుగున
పడిన చరిత్రను వెలికితీయడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రధానోపాధ్యాయులు ఎం. భీమార్జున రెడ్డి అన్నారు. గురువారం హుజూర్ నగర్ పట్టణం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కమీషనర్ ఆఫ్ కాలేజియేట్
ఎడ్యుకేషన్, తెలంగాణా సాహిత్య అకాడెమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థుల ద్వారా నిర్వహిస్తున్న “మన ఊరు –
మన చరిత్ర” అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల
ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన వారికి గ్రామ చరిత్రలపై పూర్తి అవగాహన
ఏర్పడుతుందని అన్నారు. జిల్లా సమన్వయ కర్త, కోదాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. నిర్మలా కుమారి మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యంతో ఎంతటి క్లిష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయవచ్చని, అందుకే ఇంత గురుతరమైన బాధ్యతను విద్యార్ధులకు అప్పగించారని అన్నారు. తమ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులకు అవగాహన కలుగుతుందని, దాంతో వారు ఆ రూపంగా కృషి చేసి భవిష్యత్తులో తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకుంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. అప్పారావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.