రాయికోడ్ జనం సాక్షి ఫిబ్రవరి 08రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామంలో జరుగనున్నట్లు జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, సర్పంచ్ సంతోష్ కుమార్ పాటిల్, ఎంపీటీసీ నిరంజన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మారుఫ్ అలీ, ఉప సర్పంచ్ శివరాజ్ లు తెలిపారు. ఈ నెల 8న బుధవారం సర్కారీ గంధం, 9న గురువారం రాత్రి 8 గంటలకు గ్రామ పంచాయతీ నుండి దర్గా షరీఫ్ వరకు గంధము, 10న శుక్రవారం దీపాల పండగ, 11న ఖవాలీ కార్యక్రమం, 12న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపారు. కుస్తీ పోటీలలో గెలిచిన వారికి 5 తులాల వెండి కడియంను ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చేతుల మీదిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతర ఉత్సవాలకు వివిధ గ్రామాల ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.




