Wednesday, 4 November 2026

నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బి మంత్రిని కలిసిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

 

 

 

పుట్ట మధు మంథని, జనం సాక్షి : పెద్దపల్లి నుండి కాటారం రోడ్డు మరమ్మతులు చేస్తూ.. రహదారి లోని గ్రామాల సరిహద్దుల్లో నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్ల కు నిధులు మంజూరు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ను మర్యాద పూర్వకంగా కలిసి పెద్దపల్లి నుండి కాటారం రహదారి మరమ్మతులు చేస్తూ, రహదారిలోని గ్రామాల సరిహద్దుల్లో నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్ల కు నిధులు మంజూరు చేయాలని ఈ రోడ్డు ముఖ్యమైన రహదారి అని రాజీవ్ రహదారి SH-1 TO నేషనల్ హైవే 353C సిరోంచ-ఆత్మకూరు లను కలుపుతుందని,ఈ రహదారి తెలంగాణ ప్రభుత్వం లో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వైపు వెళ్తుంది,ఈ రహదారి రెండు పెద్ద ప్రారిశ్రామిక పెద్దపల్లి & భూపాలపల్లి జిల్లాను కలుపుతుంది మరియు తెలంగాణ రాష్ట్రం నుండి చతిస్గడ్ రాష్ట్రం వయా కాళేశ్వరం బ్రిడ్జి సిరించ వద్ద కలుపుతుంది. ఈ రహదారి సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ లకు ఉపయోగపడుతుంది కావున DMFT నిధులు 124 కోట్ల రూపాయల తో మంజూరు చేయాలని రోడ్ల & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ విజ్ఞప్తి చేశారు.