– బిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): యువత స్వశక్తితో ఎదగాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హన్సి బేకరీ అండ్ టీ పాయింట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారిన తర్వాత వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.దీంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.యువత స్వయం ఉపాధితో ఎదిగి ఆదర్శంగా నిలవాలని అన్నారు.యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదిగి, పది మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాప్ నిర్వహకులు బత్తుల చిన్నా , పాస్టర్ రాజేష్ , యోసోబ్ , బిక్షం , వెంకట్ , సందీప్ , కళ్యాణ్ , వాణి, ప్రీతి , జయ తదితరులు పాల్గొన్నారు.




