ఈ రోజు పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో గద్దరన్న కు, సియసత్ ఉర్దూ దిన పత్రిక
మేనేజింగ్ డైరెక్టర్ జహీర్ అలి ఖాన్ ల స్మారక సభ జరుపుకున్నది. వీరి ఆకస్మిక మరణం తో రాష్ర్టం ఒక్కసారి ఉలిక్కి పడింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్మాల అన్నారు. సియాసత్ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ ప్రజల పక్షం నిలబడింది, పాత బస్తీ నిరుపేద మహిళల అభివృద్ది కోసం చాలా సహాయంగా నిలబడ్డారు అని అన్నారు. మరియు గద్దర్ ఒక మనిషి కాడు ఒక విప్లవం, ఈ విప్లవం ఆగదు సాగుతూనే ఉంటుంది అని అన్నారు. వీరిద్దరి లోటు ఎవ్వరూ పూడ్చలేనిది, కానీ వారి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుకు అడుగులు వేయాలని అన్నారు. లౌకిక స్వభావం కలిగిన వ్యక్తి జహీర్ అలి ఖాన్ అని అన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, గద్దరన్నను కొద్ది రోజుల క్రితమే కలిసాను, అయితే ఆ రోజు కలిసినప్పుడు అనారోగ్యంగా ఉన్నట్టు అగుపడ లేదు. ఉద్యమాల నిర్మాణం లో గద్దర్ గారు ప్రధాన పాత్ర పోషించిన వారు అనటం అతిశయోక్తి కాదు అన్నారు. జహీర్ అలి ఖాన్ గారు ఆ రోజుల్లో ఉర్దూ పత్రిక నడిపించిన దీ శాలి అని కీర్తించారు. వారి నాన్న గారు శియాసత్ పత్రికను స్థాపించి నారు అన్నారు. గద్దర్ గారు, జాహీర్ అలి ఖాన్ గారు ఇద్దరూ ఒక రోజు తేడాతో మరణం పొందారు. చాలా విచార కరమైనది అని అన్నారు.జంట నగరాల శాఖ ప్రధాన కార్యదర్శి రీయజుద్దిన్ మాట్లాడుతూ జాహీర్ అలి ఖాన్ సాబ్ గొప్ప సంఘ సంస్కర్త, ముస్లీం సమాజం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది అని అన్నారు.వీరిద్దరూ పేదల పక్షం నిలబడిన వారు, పేదల పక్షపాతి గా పౌర హక్కుల ప్రజా సంఘం తెలంగాణ రాష్ట్రం కొనియాడింది. ఈ స్మారక సభలో PUCL సభ్యులు ఇక్బాల్ ఖాన్, రూఢా హరీట్,ఎం.డి ఖాజా, షేక్ షాజిద్, యాఖుబ్ , యూసఫ్, మసూద్, సుదర్శన్ రెడ్డి, సలీం, తదితరులు పాలుగొన్నారు.