ఎర్ర జెండా కప్పి పూల దండలు వేసి నివాళులు అర్పించిఏఐటీయూసీ,సిపిఐ నాయకులు మాట్లాడారు.
కామ్రేడ్ స్వామి మందమర్రి భూస్వామ్య వ్యవస్థ కు వ్యతి రేకంగ ఉద్యమాలు చేసిన మహనీయుడు.సింగరేణికాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు4 దఫాలు కొనసాగి కార్మిక హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన నాయకు. పార్టీ ట్రేడ్ యూనియన్ క్రమ శిక్షణ తోపని చేసి జైల్ జీవితం గడిపిన నిజాయితీ గల నాయకు స్వామి నికోల్పోవడం భాద కరం అనిఅన్నారు.ఉండేటి స్వామి ఆశయాలను మును ముందకు తీసుకు పోయివారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్య దర్శి సలేంద్ర సత్యనారాయణ. సిపిఐ, మందమర్రి పట్టణ కార్యదర్శి కామేర దుర్గరాజు. ఆర్ కెపి బ్రాంచి ఉపాధ్యక్షులు ఇప్పకాయలలింగయ్య. సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు శత కోపం కిష్టయ్య. పెద్దపెల్లి బానయ్య. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంటోని దినేష్.బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శిదాగం మల్లేష్. ట్రేడ్స్ మేన్ నాయకుడు ఆర్ రాజనర్సు,తదితరులు పాల్గొనిమాట్లాడి నివాళులర్పించిన వారిలో ఉన్నారు! సీనియర్ జర్నలిస్ట్,స్వామి మిత్రుడు,ఉద్యమ సహచరుడు,ఎండి.మునీర్,క్యాతనపల్లి లోని స్వామి ఇంటికి వెళ్లి బౌతిక కాయానికి నివాళి అర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చారు!స్వామి అంత్యక్రియలు మంగళవారం ఆర్కెపి లో జరిగాయి.కుటుంబ సభ్యులు,బందు,మిత్రులు పాల్గొన్నారు.




