Wednesday, 4 November 2026

భారత రాజ్యాంగం గ్రంధాన్ని ప్రతి పౌరుడికి అందించాలి

 

 

 

 

 

 

 

 

బాల్కొండ మే 9( జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలో మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం గ్రంధాన్ని ప్రతి పౌరుడికిఅందించాలని తెలంగాణ బిసి సంఘం ఉమ్మడి అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్, జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ వినోద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్. విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని తాసిల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగం గ్రంధాన్ని ప్రతి పౌరుడికి అందించాలని వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో. తెలంగాణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ , మండల డి.ఎస్.పి అధ్యక్షులు హారప్ప మహారాజ్ ,తెలంగాణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గ బిసి సంఘం అధ్యక్షులు దాసరి మూర్తి. డి.ఎస్.పి పార్టీ మండల ప్రచార కమిటీ సభ్యులు సతీష్, ఆత్మ గౌరవ్,నిశాంత్ ,దిలీప్, రాజేందర్,రాజశేఖర్,లక్ష్మణ్,బస్సపూర్ గ్రామ గోసంగీ కుల యూత్ సభ్యులు రవి,రామ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.