Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్ష పదవికి గాను నియామక పత్రం అందజేత

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 9 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్ష పదవికి సంబంధించి నియామక పత్రాన్ని హుజూర్ నగర్ కు చెందిన ముక్కా పృథ్వి కుమార్ కు మంగళవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ ఆర్యవైశ్య వాసవి భవన్ లో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా (మాజీ టూరిజం చైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు ఐవిఎఫ్) బొగ్గారపు దయానందం చేతులు మీదుగా ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షులు కట్టా రవికుమార్, పొలిటికల్ చైర్మన్ మాశెట్టి ఆదిత్య, ఓలా కోటేశ్వరరావు, కార్యకర్తలు, మేడ్చల్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.