ఉక్కు కర్మాగార వాటాల అమ్మకాలను ఉపసంహరించాలి
విశాఖ: ప్రభుత్వం రంగ సంస్థలను పరిరక్షించాలని నూతన ఆర్థిక విధానాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిన్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవానికి సత్వరం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఫెడరరేషన్ ఆధ్వర్యంలో విశాఖ అంబేద్కర్ విగ్రహం నుంచి జగదాంబ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారం వాటాల అమ్మకాలను ఉపసంహరించాలని. 10వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని ఫెడరేషన్ నాయకులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ర్యాలీలో ఏపీఐఐసీ, ఏపీ గృహ నిర్మాణ మండలి, పౌర సరఫర సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.



