Wednesday, 4 November 2026

ఉక్కు పరిశ్రమకు… కేబినెట్‌ పచ్చజెండా

– నెలరోజుల్లో శంకుస్థాపన
– రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట స్టీల్‌ ప్లాంట్‌
– రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మాణం
– ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
– కేంద్రం నెరవేర్చని హావిూలను రాష్ట్రమే చేపట్టేలా నిర్ణయం
అమరావతి, నవంబర్‌6(జ‌నంసాక్షి) :  కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని హావిూలను రాష్ట్రమే చేపట్టేలా ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కడప జిల్లాలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల రోజుల్లోపు ఓ మంచి రోజు చూసుకుని స్టీల్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన చేయాలని, ఇందుకు రూ.18వేల కోట్ల వ్యయంతో అవుతుందని అంచనా వేశారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దొనకొండ మెగా ఇండస్ట్రీరియల్‌ హబ్‌కు ఆమోదం తెలిపారు. పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అన్ని విధాలుగా అనుకూలమనే దిశగా కీలక చర్చలు
చేస్తున్నట్టు సమాచారం. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో 125, గ్రావిూణ ప్రాంతాల్లో 152 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 44 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 31 నాటికి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 124 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రానికి లేఖరాయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలేదంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి రెండోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. తిత్లీ తుపానుకు రూ.3,600 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు పంపడంతోపాటు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని కోరగా.. కేవలం రూ.229 కోట్లు మాత్రమే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీనిపైకేంద్ర ¬ంమంత్రికి మరోసారి లేఖ రాయనున్నారు.
ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇలా..
– కేంద్రం నెరవేర్చని హావిూలను రాష్ట్రమే చేపట్టాలని నిర్ణయం
– రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం
– నెలరోజుల్లో కడప స్టీల్‌  ప్లాంట్‌కు శంకుస్థాపన
– ప్రైవేట్‌ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్‌ వెంచర్‌ దిశగా ప్రయత్నాలు
–  పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
–  రూ. 8,300 కోట్లతో 42 కిలోవిూటర్ల మేర వైజాగ్‌ మెట్రో
– గాజువాక-కొమ్మాది- 30 కి.విూ, గురుద్వారా- ఓల్డ్‌ పోస్టాఫీసు-5.25 కి.విూ..
– తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.విూ మెట్రో రైలు
– అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
– గ్రావిూణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
– రాష్ట్ర వ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్లు ఏర్పాటు
– మున్సిపాలిటీలో 215, గ్రావిూణ ప్రాంతాల్లో 152 క్యాంటిన్లు ఏర్పాటు
– వచ్చే జనవరి 31నాటికి గ్రావిూణ ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని ఆమోదం తెలుపుతూ కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్‌ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.