ఉక్కు మనిషి సర్దార్ వల్ల భాయి పటేల్ :శామీర్ పేట్, జనంసాక్షి :
గురువారం శామీర్ పేట లో భారత తొలి ఉప ప్రధాని , ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 72 వ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. భారత స్వాతంత్ర్య సమరం లో ఆయన పాత్ర కీలకమైనదని , బారిష్టర్ గా ,ఉప ప్రధానిగా దేశ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. యువత, ముఖ్యంగా విద్యార్థులు వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు అనుసరించి దేశం కీర్తి ప్రతిష్టలు ఇనుమ డింప చేయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు మండల కేసిఆర్ సేవాదళం అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, సోగాడ బాల్ రాజ్, బత్తిని చందర్ ,పసుపుల నర్సింహ ,సాఖిబ్, విద్యార్థులు పాల్గొన్నారు.
15ఎస్పీటీ -2:నివాళులు అర్పిస్తున్న నాయకులు
ఉక్కు మనిషి సర్దార్ వల్ల భాయి పటేల్




