Wednesday, 4 November 2026

మాల మహానాడు మండల మహాసభ జయప్రదం చేయండి

మాల మహానాడు మండల మహాసభ జయప్రదం చేయండి
రఘునాథ పాలెం డిసెంబర్ 15 జనం సాక్షి 1 తిరుమలాయపాలెం లో 18 న మండల కేంద్రము లో జరుగుతుంది ఈ రోజూ హసానబాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశములో G.ప్రభాకర్ సభా అధ్యక్షతన జరుగగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాలమహానాడు రాష్ట్రా నాయకులు గుంతేటీ వీరభద్రమ్ పాల్గొని మాలాలపై జరుగుతున్న దాడులు,మరియు వివిధ భూ సమస్యలపై, మాల మహానాడు పోరాడుతూ, బీరోలు, హాసనబడ్, దమ్మాయి గూడెం, కొక్కిరేని,ఎర్రగడ్డ,తదితర గ్రామాల్లో వివిధ సంఘటనలపై పోరాడి పరిష్కరించడం జరిగింది.మును ముందు కూడా మాలమహానాడు ఐక్యతను కాపాడుతూ అనైతికమయిన S C వర్గీకరణ కు స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్న ఆధిపత్య వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు, పార్టీల కుట్రను అర్దం చేసుకోలేని మాదిగ సోదరులు వర్గీకరణ అంటూ దళిత ఉద్యమాలకు ద్రోహం చేస్తున్నారు.దళితుల రాజ్యాధికారం కోసం, రిజర్వేషన్ పెంపు కొరకు పోరాటం,అలాగే దళిత బందు,డబుల్ బెడ్రూం లలో జరుగుతున్న అన్యాయమును ఎదిరించాలని, ,ఆదివారం జరిగే మండల మహాసభను అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని కోరుతూ, ఈకార్యక్రమంలో మహానాడు జిల్లా ప్రధా నకార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రచార కార్యదర్శి పెరములపల్లి బాలస్వామి.కామల కనకరత్నం,మండల అధ్యక్షలు పప్పుల ప్రసాద్. పప్పుల తిరపయ్య,నల్లపు రమేష్ గుంతేటి ప్రభాకర్ ,రాము,పల్లి ఉపేందర్,సందీప్,సురేష్,పప్పుల నాగేశ్వరరావు,సుధాకర్, వెంకటేశ్వర్లు తదితరుల పాల్గొన్నారు. 18 న జరిగే మహాసభకు రాష్ట్ర,జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొంటారు.