జనం సాక్షి , మంథని : మంథని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉగాది శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంము లో అంత శుభాలు కలగాలి, పంటలు బాగ పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పర్వదిన శుభ సందర్భంలో భగవంతుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతిఒక్క కుటుంబములో అందరికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, కొత్త వెలుగులు నింపాలని భగవంతున్నీ ప్రార్దిస్తున్నానని తెలిపారు.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు




