మణుగూరులో హై రిచ్ ఆన్లైన్ షాపీ ప్రారంభం.
▪️సరుకు కొనుగోలుపై డిస్కౌంట్ ..
▪️వినియోగదారులకు ఆదాయాన్ని ఇచ్చే ఆన్లైన్ షాపీ.
పినపాక నియోజకవర్గ ప్రతినిధి మార్చి 22 (జనంసాక్షి): మణుగూరు మండలం అశోక్ నగర్ లో శ్రీ శివ సాయి బాలాజీ సూపర్ మార్కెట్ నందు హై రిచ్ ఆన్లైన్ షాపీ ని ప్రొప్రైటర్ దోసపాటి ధర్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముందుగా వినియోగదారులకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శివ సాయి బాలాజీ సూపర్ మార్కెట్ అందరికీ సుపరిచితమే గత రెండు సంవత్సరాల నుంచి వినియోగదారులకు ఆదరిస్తున్నారు. వారికి ప్రతినెల ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తున్న సంగతి విదితమే దాంతోపాటు వినియోగదారులకి బహుమతులతో పాటు ఆదాయాన్ని ఇచ్చే కొత్త విధానాన్ని ప్రారంభించాం దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హై రిచ్ ఆన్లైన్ షాపింగ్ మొదట కేరళ లోని తిసూర్ జిల్లాలో 2016 లో ప్రారంభించారు.మొదట నలుగురితో మొదలై 2018లో 50000 మంది 2020లో మూడు లక్షల మంది 2023 1.33 లక్షల మంది వినియోగదారులు హై రిచ్ ఆన్లైన్ ద్వారా సరుకులు కొనుగోలు చేస్తున్నారు.
హై రిచ్ ఆన్లైన్ షాపీ ఉపయోగాలు:
నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్ తోపాటు ఆదాయాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు అదెలాగామొదట రూ. 699 హై రిచ్ ఆన్లైన్ షాపీ లో జమ చేసి ఐడీ నంబర్ పొందాలి. ఈ ఐడి నెంబర్ తో ఎక్కడైనా సరుకులు కొనుగోలు చేసిన డిస్కౌంట్ వర్తిస్తుంది. దీంతోపాటు ఇంకొక వ్యక్తిని పరిచయం చేయిస్తే అతను కొనుగోలు చేయటం ద్వారా ఆదాయం చేకూరుతుంది. ఇలా ఎంతమందిని జాయిన్ చేయిస్తే అంత ఆదాయం లభిస్తుంది
మార్కెట్లోకి కొత్త ఆన్లైన్ షాపి:
హై రిచ్ ఆన్లైన్ షాపీ ద్వారా భవిష్యత్తులో నాణ్యమైన బట్టలు , ఔషధాలు, హెల్త్ లైఫ్ ద్వారా సేంద్రీయ ఎరువులతో పండించిన కాయగూరలు ఆకుకూరలు అందుబాటులోకి తేనుంది. వినియోదారులకు డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఆదాయాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ బాబు, దోసపాటి నరేందర్ వినియోగదారులు సూపర్ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో హై రిచ్ ఆన్లైన్ షాపీ ప్రారంభం.




