ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెరపల్లి గ్రామానికి చెందిన కందునురి రాకేష్ సింగరేణి ఆర్ జి త్రీ లో ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. రాకేష్ కొడుకుకి హర్డ్ లో రెండు హాల్స్ ఉన్నాయి అని డ్రాక్టర్ చెప్పినారు వారు ప్రైవేట్ హాస్పిటల్ లో చేపిస్తే 3 లక్షలు రూపాయలు ఖర్చు అవుతాయి డ్రాక్టర్ చెప్పినారు. ఇంత ఖర్చు పెట్టు చికిత్స చేయించుకునే స్థోమత తమకు లేదని తమకు సహాయం అందించాలని మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించి హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయించారు. ఉచితంగా ఆపరేషన్ ఖర్చులు లేకుండా చేపించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు జీవితకాలం రుణపడి ఉంటామని ఆ చిన్నారి బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సోమవారం చిన్నబాబు (రిత్విక్) క్షేమంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది.