Tuesday, 3 November 2026

ఉచిత కంటి శుక్లo శస్త్ర చికిత్సల కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలింపు

జనం సాక్షి , మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాల నుంచి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు,లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ విజన్ కేర్ ఆక్టివిటీస్ డిస్ట్రిక్ట్ కమిటీ ఛైర్మన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యులు లయన్ పూదరి దత్తాగౌడ్ ఆధ్వర్యంలో 46 మందిని ఉచిత కంటి శుక్లo శస్త్ర చికిత్సల కోసం లయన్స్ రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ కు సోమవారం రోజున తరలించారు. వీరికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పించారు. ఉచిత కంటి శస్త్ర చికిత్సలకు సహకరిస్తున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 జి ఛార్టర్డ్ గవర్నర్ , రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ ఛైర్మన్ లయన్ చిదుర సురేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యదర్శి లయన్ భూతగడ్డ చందు, కోశాధికారి *లయన్ అబ్దుల్ వాసే అభినందించారు. క్లబ్ డైరెక్టర్ లయన్ గౌస్ హుస్సేన్, లయన్ బుద్ధర్తి సతీష్ కుమార్, విజన్ ఐ కేర్ సెంటర్ రాయల్ ఆప్టికల్స్ మంథని నిర్వాహకులు శంషీర్ అలీ పాల్గొన్నారు.