కొత్తగూడ జూలై 3 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామంలోని గ్రామ దేవతలకు,బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాలకు జలాభిషేకంనిర్వహించినగ్రామస్తులు.వర్షాలు కురువకపోవడంతోరైతులువేసినవిత్తనాలువేసినట్టేఎండిపోవడంజరుగుతుంది.వర్షాకాలం ప్రారంభంలో తొలకరి చినుకు పడి రైతులకు ఆశ కలిగించి తిరిగి ఇంతవరకు వర్షం పడకపోవడంతో వెయ్యిల రూపాయల విత్తనాలు తెచ్చి విత్తనాలు నాటడం జరిగింది.అలా వేసిన విత్తనాలు గత 20 రోజులు దాటుతున్న వర్షం పడకపోవడంతో రైతుల్లో గుండెల్లో ఆందోళన కలిగిస్తున్నది.వరుణదేవుడు కనుకరించి వర్షాలు కురవాలని బంజారాల నృత్యాలు వేస్తూ ప్రతి ఒక్కరు బిందెలతో నీరు తీసుకువచ్చి గ్రామంలోని బొడ్రాయి కి జలాభిషేకం చేయడం జరిగింది.
వర్షాల కోసం బొడ్రాయికి జలాభిషేకం




