Tuesday, 3 November 2026

వార్డు కార్యాలయాన్ని పరిశీలించిన జోనల్ కమిషనర్.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 3వసంత పూరి కాలని లో ఏర్పాటు చేసిన ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ వార్డు కార్యలయాన్ని జోనల్ కమిషర్ శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పలు సుచనలు సలహాలు చేశారు.ఫిర్యాదులను ఆన్ లైన్ లో కానీ,ఆఫ్ లైన్లో కానీ స్వీకరించాలని,వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.డివిజన్ లో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు జిహెచ్ఎంసి యాప్  ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఈకార్యక్రమంలో డిసి రాజు,ఈఈ లక్ష్మణ్,ఏసీపిగజనంద్,డీఈలౌక్యా,సెక్షన్అధికారిదయానంద్,ఎఎంహెచ్ఓవెంకటేష్వరులు,ఏఈశ్రీకాంత్,సత్యమూర్తి,బ్రామయ్య,ఉమాపతి,కిషొర్, తదితరులు పాల్గొన్నారు,