Saturday, 7 November 2026

ఉచిత కరెంటుపై అవగాహన కల్పించాలి.

ఉచిత కరెంటుపై అవగాహన కల్పించాలి.
– తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి.
బెల్లంపల్లి, డిసెంబర్ 19, (జనంసాక్షి )
తెలంగాణ ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, రజకులకు, నాయి బ్రాహ్మణులకు అందించే 101యూనిట్ల ఉచిత కరెంటుపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని కోరుతూ సోమవారం బెల్లంపల్లి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రామచంద్ర కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, రజకులకు, నాయి బ్రాహ్మణులకు ప్రతి నెల వంద యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తుందని, ప్రజల్లో సరైన అవగాహనా లేక చాలా మంది ఎస్సి, ఎస్టీలు ఈ పథకానికి దూరంగా ఉన్నారని, పథకం ఉద్దేశం ప్రజల్లో చేరి వాటి ఫలాలు అర్హులకు అందేలా చూడాలని కోరారు. ఈకార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు దాసరి జయ, నాయకులు చీటి పోశం, నిచ్చకోలా పుల్లయ్య, కొప్పుల రవళి తదితరులు పాల్గొన్నారు