Saturday, 7 November 2026

కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
అలంపూర్ జనంసాక్షి (డిసెంబర్ 19)
దేశం సుబిక్షంగా ఉండాలంటే కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని రాష్టాకార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి అన్నారు.
జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సోమవారం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే అబ్రహం తో కలసి దర్శించుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని చేరుకున్న తర్వాత ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డీ మరియు ఈవో పురేందర్ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.మంత్రి ని శాలువా పూలమాల తో సత్కరించారు. ఈసందర్బంగా ఉభయ ఆలయలలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ
మొట్ట మొదటిసారిగా శ్రీ.శ్రీ.శ్రీ. జోగులాంబ స్వామి దేవస్థానం దర్శించుకోవాలని చాలా రోజుల నుండి అనుకున్న సమయం కుదర్లేదు అని, ఈ రోజు అదృష్టకరంగా భావిస్తున్నానని స్వామివారిని అమ్మవారిని ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని,రైతులకు వర్షాలు సకాలంలో పడి పాడిపంటలు సమృద్ధిగా అభివ్రుది కావలని అలాగే, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గా పరుగులేస్తుందని అన్నారు. అందుకే ఇలాంటి అభివృద్ధి దేశమంతా జరగాలని టిఆర్ఎస్ పార్టీని బిఆర్ ఎస్ పార్టీ గ మార్చి దేశ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు.రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దేశ ప్రధాన మంత్రి కావాలని ప్రార్థించుకున్నానని అన్నారు.
మంత్రి వెంట మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ, యూవ నాయకుడు అజయ్, వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు వివిధ మండలాల జడ్పిటిసిలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ మండలాల అధ్యక్షులు కో ఆప్షన్ మెంబర్లు మరియు పార్టీ నాయకులు మరియు అజయ్ అన్న సేవా దళం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.