Tuesday, 3 November 2026

ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల…ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల…

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నది. గురువారం ఉదయం ధర్మపురిగోదావరి నదిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేప పిల్లల ను గోదావరి నదిలో వదిలారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులవృత్తుల వారికి పెద్ద పీట వేస్తూ ఆర్థికంగా ఎదగటానికి ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి, రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్, సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని తేలిపారు.తెలంగాణ రాష్ట్రం లో  మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు,తెప్పలు,ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని,గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి. సతేమ్మ టెంపుల్ చైర్మన్ ఇందారపు రామన్న, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పిటిసి బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, ఏఎంసి వైస్ చైర్మన్ అక్కనపల్లి. సునీల్, మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.